జనగామ : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో వివిధ ప్రమాదాల్లో మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరుపున ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.
పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల బలం టీఆర్ఎస్కు ఉందన్నారు. పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవడంలో పార్టీ అధినేత, సీఎం కెసీఆర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు.