హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా.. లోక్సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు.
రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు నివేదికలు అందజేస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కేంద్రం పట్ల అనుసరించాల్సిన పోరాట పంథాపై సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారు.