ఐదు వేల ఇండ్లు కట్టిస్తా

- ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి
- రాష్ట్ర మంత్రిగా పనిచేయించలేని వ్యక్తి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తడు?
- కేసీఆర్ 4 వేల ఇండ్లు ఇస్తే ఒక్కటైనా కట్టిండా?
- టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్, సెప్టెంబర్ 30: ‘ఒకసారి అవకాశం ఇవ్వండి.. ఉప ఎన్నికలో గెలిపించండి. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉం టా. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నియోజకవర్గానికి 5 వేల ఇండ్లు మంజూరు చేయించి కట్టిస్తా’ అని టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. గురువారం ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి, బోగంపాడు గ్రామాల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రోడ్డు వెంట కలిసిన వృద్ధులు, రైతులు, యువకులను ఆప్యాయంగా పలుకరిస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరగా, గ్రామస్థులు సైతం శ్రీనివాస్‌కు జై కొట్టారు. అనంతరం ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. పేదల కోసం సీఎం కేసీఆర్ 4 వేల ఇండ్లు ఇస్తే ఒక్కటీ కట్టించలేదని ఆరోపించారు. మంత్రిగా ఉండి కూడా పని చేయించలేని వ్యక్తి.. రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తడో ఆలోచించాలని కోరారు. తనను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటానని, పేద ప్రజల కోసం నియోజకవర్గానికి 5 వేల ఇండ్లు మంజూరు చేయించి కట్టిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి పథకాలు బీజేపీ పాలిత 18 రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉన్నాయా..? ఆ పార్టీ నాయకులు చెప్పాలని డిమాండ్‌చేశారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. ప్రతిపక్షాల ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే వారిని ఆశీర్వదించాలని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని శిరసు వంచి కోరుతున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

