కొత్తగూడెం, అక్టోబర్ 31: పోడు సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం కొత్తగూడెంలో కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎలాంటి సమస్యకైనా సీఎం కేసీఆర్ పరిష్కారం చూపగలరన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పోడు భూముల సమస్య ఉన్నదని, దీని పరిష్కారం కోసమే సీఎం క్యాబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని పాల్గొన్నారు.