ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 15:22:00

గోల్నాక, ఖైర‌తాబాద్ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ ఆధిక్యం

గోల్నాక, ఖైర‌తాబాద్ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ ఆధిక్యం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డ్డ‌ ఫ‌లితాల్లో టీఆర్ఎస్ అత్య‌ధిక డివిజ‌న్ల‌లో త‌న ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ముందంజ‌లో నిలుస్తోంది. గోల్నాక డివిజ‌న్ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి దూస‌రి లావ‌ణ్య 7184 ఓట్ల‌తో ముందంజ‌లో కొన‌సాగుతూ.. గెలుపు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. బీజేపీ అభ్య‌ర్థి 5725 ఓట్ల‌తో రెండోస్థానంలో నిలువ‌గా..కాంగ్రెస్ 326 ఓట్ల‌తో మూడో స్థానంలో నిలిచింది. 

ఖైరతాబాద్ డివిజ‌న్ లో మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి విజయరెడ్డి 7261ఓట్ల‌తో ముందంజ‌లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి వీణ మాధురి 5201 ఓట్లు సాధించ‌గా..టీఆర్ఎస్ అభ్య‌ర్థి 2060 ఆధిక్యంలో ఉన్నారు. బంజారాహిల్స్ డివిజ‌న్ లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి 6122 ఓట్ల‌తో ముందంజ‌లో ఉన్నారు.  బీజేపీ అభ్య‌ర్థి 4155 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ 1968 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అంబర్ పేట టిఆర్ఎస్ అభ్యర్థి విజయ్ కుమార్ గౌడ్ లీడ్ లో కొన‌సాగుతున్నారు. సోమాజిగూడ లో టీఆర్ఎస్  అభ్య‌ర్థి 2,458 లీడ్ లో ఉన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo