హైదరాబాద్ : రాష్ట్రంలో కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న లక్షలాధి మంది రజకులకు సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్‌ను అందించిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కృష్ణ తెలిపారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే తమ ఓటు వేసి గెలిపించాలని మునుగోడు రజకులకు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తెలంగాణ వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతి, వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీసీల కుల గణన చేయకుండా కేంద్రం మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈనెల 3న జరిగే పోలింగ్‌లో కారు గుర్తుకు ఓటు వేయాలని రజకులకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.