గజ్వేల్, ఫిబ్రవరి 24: గజ్వేల్ ప్రభుత్వ జిల్లా దవాఖానలో సోమవారం ఓ గర్భిణి ఒకే కాన్పు లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కాగా, ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారు. ములుగు మండలం అడవిమజీద్కు చెందిన బత్తిని నాగరత్న-నర్సింహులు దంపతులకు ఏడేండ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం లేకపోవడంతో దవాఖానల్లో చూపించుకున్నారు. ఏడో సంవత్సరం నాగరత్న గర్భం దాల్చడంతో ప్రతినెలా గజ్వేల్ దవాఖానలోనే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రసవం కోసం ఆదివారం దవాఖానలో చేరగా, ఆమెకు సోమవారం వైద్యులు మంజు ల, త్రివేణి, సుశీల, అఫ్రోజ్ సిజేరియన్ చేయ గా, మొదట ఇద్దరు అబ్బాయిలు తరువాత అమ్మాయికి జన్మనిచ్చింది. వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ అన్నపూర్ణ, ఆర్ఎంవో డాక్టర్ రాము అభినందించారు.