హైదరాబాద్ /నాంపల్లి: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్‌కుమార్ హాజరై రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. సర్వమత సారం ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలని తెలిపారు.
అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఖర్జురాలు, పండ్లు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, ఎండీ రియాజుద్దీన్, ఉపాధ్యక్షులు కే నిరంజన్, కే నాగమణి, మాధవిరెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ నారాయణరెడ్డి, కార్యదర్శులు వాణిరెడ్డి, మనోహర్ చక్రవర్తి, నజీంఖాన్, దేశ్య నాయక్, బీ శైలజ, వాణి, సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.ఎల్లారెడ్డి, ముర్తుజా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శుక్ల కుమార్, మేడ్చల్ అధ్యక్ష, కార్యదర్శులు పీ సుధాకర్, రామకృష్ణారెడ్డి, వికారాబాద్ అధ్యక్షుడు బీ కృష్ణయ్య, కార్యవర్గ సభ్యులు షఫీయుద్దీన్, మునీర్, పీ శ్రీనివాస్‌రెడ్డి, సైదులు, సంగ్రాంరెడ్డి, చైతన్య, రఫీ, తదితరులు పాల్గొన్నారు.