హైదరాబాద్: ఆమె ఒక ట్రాన్స్జండర్..! పైగా నిరుపేద కుటుంబంలో పుట్టిన బిడ్డ..! చిన్న నాటి నుంచి ఎన్నో చీత్కారాలు, వెక్కిరింతలు, బెదిరింపులు ఎదుర్కొన్నది..! అయినా ఆమె ఏనాడూ అదరలేదు బెదరలేదు..! తన హిజ్రా సామాజిక వర్గం చేసే పోరాటంలో ఆమె ఎప్పుడూ వెనకడుగు వేయలేదు..! తన కమ్యూనిటీని సమాజం గౌరవించేలా చేయడం కోసం అహర్నిశలు శ్రమించారు..! చివరికి తాను అనుకున్నది సాధించారు..! ఓ సాధారణ ట్రాన్స్జండర్ అయిన ఆమె తన నడవడికతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని, ఏకంగా తెలంగాణ ఎన్నికల కమిషనే తనను ఐకాన్‌గా నియమించుకునే స్థాయికి ఎదిగారు..! ఆమె ఎవరో కాదు.. ట్రాన్స్జండర్ లైలా..! అంతెత్తుకు ఎదిగిన లైలాతో మా నమస్తే తెలంగాణ యూ ట్యూబ్ ప్రతినిధి నరేంద్ర ఇంటర్వ్యూ మీ కోసం. ఈ ఇంటర్వ్యూలో లైలా తన జీవితానికి సంబంధించి, తన కమ్యూనిటీకి సంబంధించి ఎన్నో విషయాలను పంచుకున్నారు..