Election Campaigner | తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్జెండర్
Election Campaigner | తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్జెండర్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్ వరంగల్ నగరంలోని 33వ డివిజన్ ఎస్ఆర్ఆర్తోట ప్రాంతానికి చెందిన ట్రాన్స్జెండర్ లైలాను ఎంపిక చేసింది.
Election Campaigner | గిర్మాజీపేట, సెప్టెంబర్ 20: తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్జెండర్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్ వరంగల్ నగరంలోని 33వ డివిజన్ ఎస్ఆర్ఆర్తోట ప్రాంతానికి చెందిన ట్రాన్స్జెండర్ లైలాను ఎంపిక చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికిపైగా ట్రాన్స్జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ అధికారులు ఓటరు జాబితా, ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టి సారించారు.
ఇందులో భాగంగా.. ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ఎన్నికల కమిషన్ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నది. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రచారకర్తలుగా సెలబ్రిటీలు, నటులు, సామాజికవేత్తలను ఎంపిక చేస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ సారి వరంగల్కు చెందిన ట్రాన్స్జెండర్ లైలాను ప్రచారకర్తగా ఎంపిక చేసినట్టు ఎలక్షన్ కమిషన్ పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

