హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): మెడికల్ టూరిజం పాలసీతో తెలంగాణను గ్లోబల్ హెల్త్ హబ్‌గా మారుస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ‘అందరికీ అందుబాటులో చౌకైన సమాన వైద్యం’ అనే అం శంపై సోమవారం గ్లోబల్ సమ్మిట్‌లో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘హెల్త్ విజన్-2047’ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భద్రతతో కూడిన వైద్యాన్ని అందిస్తామని వెల్లడించారు. మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, తెలంగాణలో దాదాపు 100 శాతం ప్రసవాలు దవాఖానల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. క్యాన్సర్ బాధితుల కోసం ప్రతి జిల్లాలో డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉచితంగా కీమోథెరపీ అందిస్తున్నామని చెప్పారు.