హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 59 మంది జూనియర్ సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 24లోగా ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులను సంబంధిత అధికారులకు అప్పగించి బదిలీ అయిన ప్రదేశంలో బాధ్యతలు చేపట్టాలని రిజిస్ట్రార్ (విజిలెన్స్) ఉత్తర్వుల్లో పేరొన్నారు.
ఇప్పటికే వాదనలు పూర్తయి రిజర్వు చేసిన కేసుల్లో తీర్పు వెలువరించవచ్చని తెలిపారు.