హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మళ్లీ మొదలుకానున్నది. ముందు పదోన్నతులు కల్పించి, ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నంది. ఎన్నికల కోడ్ ముగియగానే సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి తీసుకుని షెడ్యూల్ ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు అడ్డంకులన్నీ (కోర్టు కేసులు) ఇటీవల తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో జూన్‌లోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని విద్యాశాఖ కసరత్తుచేస్తున్నది.