హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 8 మంది యువ ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐదుగురు 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు ఉండగా, ముగ్గురు 2021 బ్యాచ్‌కు చెందినవారు ఉన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
క్యాన్సర్ బాధితుడికిఆర్థిక సాయం
రూ. లక్ష ఎల్వోసీ మంజూరు తక్షణమే వైద్య సాయం అందించాలని సీఎం ఆదేశం
హనుమకొండ, జూలై1: హనుమకొండ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకుందామని కలెక్టరేట్‌కు తండ్రితో వచ్చిన క్యాన్సర్ బాధిత బాలుడు మహ్మద్ అదిల్ అహ్మద్ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’ కథనానికి సీఎం స్పందించారు. వెంటనే బాలుడికి వైద్య సహాయం అందించాలని సీఎంవో అ ధికారులను సీఎం ఆదేశించారు. చికిత్స కోసం బసవతారకం క్యాన్సర్ దవాఖానకు సీఎంవో రూ. లక్ష ఎల్వోసీ మంజూరు చేసిం ది. సీఎంఆర్ఎఫ్ ద్వారా మరింత సాయం అందిస్తామని సీఎం ఓఎస్డీ శ్రీనివాస్ అదిల్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.