హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 62 మంది డీఎస్పీ (సివిల్)లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. వీటిలో భాగంగా ఇద్దరు డీఎస్పీలకు గతంలో ఇచ్చిన బదిలీలను రద్దు చేస్తూ కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ బదిలీల్లో పలువురు ఏసీపీలూ ఉండగా, డీజీపీ కార్యాలయానికి అటాచ్ అయిన డీఎస్పీలకూ పోస్టింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదిరిన రెండు నెలల కాలంలోనే సుమారు 200 మందికి పైగా డీఎస్పీలు బదిలీ కావడం
గమనార్హం.