హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 10 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులిచ్చారు. ఎం నాగేశ్‌ను సంగారెడ్డి డీఆర్వోగా, అంబదాస్ రాజేశ్వర్‌ను మెదక్ ఆర్డీవోగా, రమేశ్‌బాబును సిద్దిపేట ఆర్డీవోగా, కే వెంకటరెడ్డిని జహీరాబాద్ ఆర్డీవోగా, సీహెచ్ రవీందర్‌రెడ్డిని సంగారెడ్డి ఆర్డీవోగా, పీ బెన్షాలోమ్ను హుస్నాబాద్ ఆర్డీవోగా, కే నర్సింహమూర్తిని నారాయణఖేడ్ ఆర్డీవోగా, ఎం జయచంద్రారెడ్డిని తూప్రాన్ ఆర్డీవోగా, కే గోపిరామ్ను ఆందోల్ ఆర్డీవోగా, వీ శ్రీనివాసులును నర్సాపూర్ ఆర్డీవోగా బదిలీ చేశారు. పీ సాయిరాం, కే అనంతరెడ్డి, టీ శ్యామ్ ప్రకాశ్‌ను వెయిటింగ్లో ఉంచారు.