హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏను విడుదల చేస్తూ టీజీ ట్రాన్స్కో సీఎండీ ఎస్ఎఎం రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. జూలై 23 నుంచి మే 2024 మధ్యకాలానికి చెల్లించాల్సిన డీఏ 2024 జనవరి 1 నుంచి వర్తింపజేస్తామన్నారు.
జూలై 1న అందుకునే వేతనంలో ఈ డీఏను కలిపి చెల్లిస్తామని వెల్లడించారు. ఇది వరకు డీఏ 8.77శాతంగా ఉండగా తాజాగా 11.78 శాతానికి పెరిగింది.