Radical Islamic | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అరెస్టయిన ఒమర్ అసలు పేరు కొనకళ్ల సుబ్రహ్మ ణ్యం. ఏపీలోని కృష్ణా జిల్లా పెడనకు చెందిన ఆయన ఐఎస్ఐఎస్ సానుభూతిపరు డు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కోతమాజేరులో పుట్టిన సుబ్రహ్మణ్యం.. మచిలీపట్నంలో ఇంటర్ చదివేటప్పుడే తన క్లాస్మేట్స్ అబ్బాస్, మస్తాన్ ప్రోత్సాహంతో మతం మార్చుకుని ఒమర్గా మారాడు. తర్వాత గుజరాత్‌లోని ఓ మదర్సాలో 9 నెలలు శిక్షణ తీసుకున్నాడు. అకడ హైదరాబాద్ కిషన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ ష ఫీ పరిచయం కావడంతో నగరానికి వచ్చి 2 వారాలపాటు ఇకడే ఉన్నాడు. ఆ స మయంలో బహదూర్‌పురాకు చెందిన డాక్టర్ వాసిమ్ పరిచయమయ్యాడు. అత డు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నివాసం ఉండే వైద్యుడు అబ్దుల్‌ఖాదర్ జిలానీ వద్ద సుబ్రహ్మణ్యంకు కొన్నాళ్లపాటు ఆశ్రయం కల్పించాడు.
ఆ తర్వాత అబిడ్స్‌లో నివసించే విజయవాడ వ్యక్తి వాసిత్తోపాటు మిశ్రిగంజ్కు చెందిన అబ్దుల్ ఖదీర్‌తో ప రిచయమైంది. అతనితో కలిసి 2016 ఆగస్ట్‌లో ఉర్సు కోసం కేరళలోని ఎర్నాకులం వెళ్లిన సుబ్రహ్మణ్యంకు జమ్ముకశ్మీర్‌కు చెందిన గ్లోబల్ సూల్ నిర్వాహకుడు మహ్మద్ అమీర్ పరిచయమయ్యాడు. దీంతో అతను సుబ్రహ్మణ్యంను శ్రీనగర్‌కు తీసుకెళ్లి సూల్లో అకౌంటెంట్‌గా ఉద్యోగమిచ్చాడు. 2016 నవంబర్‌లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన సుబ్రహ్మణ్యంకు ఫేస్బుక్ ద్వారా ముంబైకి చెందిన అబూ క్వాహాఫా అల్ హిందీ పరిచయమయ్యాడు. పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ పొందిన సుబ్రహ్మణ్యం.. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్ వచ్చాడు. సుబ్రహ్మణ్యం ఉగ్రవాద కార్యకలాపాలపై ముంబై, గోవా, మదురై, సౌదీ అరేబియా, నైజీరియా, జొహన్నెస్‌బర్గ్‌కు చెందిన పలువురితో చాటింగ్ చేశాడు. తాను జిహాదీగా మారుతానని, పాక్‌కు చెందిన ఉగ్రసంస్థ జైషేమహ్మద్లో చేరుతానని, కరుడుగట్టిన పాక్ ఉగ్రవాది మసూద్ అజర్‌తోపాటు ఒసామా బిన్‌లాడెన్ అనుచరులను కలవాలని ఉన్నదని చెప్పాడు. క్వాహాఫా ఆదేశాల మేరకే ఉగ్రదాడులకు కు ట్ర పన్నామని సుబ్రహ్మణ్యం తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. టెలిగ్రామ్, వా ట్సప్, ఫేస్బుక్లో సుబ్రహ్మణ్యం చాటింగ్ అంశాలను సిట్ వెలికి తీసింది.