హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) ఆధ్వర్యంలో ‘సైబర్ వారియర్స్’ పేరుతో పోలీసులకు ఈ నెల 1 నుంచి నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 858 మంది కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లకు ఈ శిక్షణ ఇచ్చినట్టు టీఎస్‌సీఎస్‌బీ వెల్లడించింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, 1930 హెల్ప్‌లైన్, అనాలిసిస్ ఆఫ్ సస్పెక్ట్ ఐడెంటిఫయర్స్, సోషల్ మీడియా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, యూసేజ్ ఆఫ్ సైకాప్స్ అప్లికేషన్, పీటీ వారెంట్ ఎగ్జిక్యూషన్, సైబర్ సెక్యూరిటీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సైబర్ వారియర్స్ తదితర 8 అంశాలపై వారికి శిక్షణ ఇచ్చినట్టు వివరించింది.