ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిక్నిక్కు వచ్చిన ఇద్దరు ట్రైనీ ఆర్మీ ఆఫీసర్లపై కొందరు దుండగులు దాడి చేసి, వారి స్నేహితురాళ్లలో ఒకరిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. చుట్టూ అడవులు, కొండలతో నిండి ఉన్న ఇండోర్ జిల్లా మౌవ్ పట్టణంలోని జామ్గేట్లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మౌవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ పొందుతున్న 23, 24 ఏండ్ల ఇద్దరు ఆర్మీ అధికారులు మంగళవారం ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి పిక్నిక్కు వెళ్లారు. వీరిపై కొందరు దుండగులు దాడి చేశారు. వారి వద్ద సొమ్ము లాక్కున్నారు. వారిలో ఒక జంటను బందీగా చేసుకుని 10 లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని డిమాండ్ చేశారు. తర్వాత వారు ఆ యువతిపై సామూహిక లైంగిక దాడి చేశారు. నిందితులు ఆరుగురు సమీపంలోని గ్రామాలకు చెందిన వారని ఎస్పీ హితికా వాసల్ చెప్పారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశంలో నైరుతి రుతు పవనాల తిరోగమనం ఈనెల 19 నుంచి 25 మధ్య మొదలవుతున్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దేశం నుంచి నైరుతు పవనాలు క్రమంగా వైదొలిగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటూ ఐఎండీ గురువారం తెలిపింది. ఈ ఏడాది జూన్ 1తో మొదలైన నైరుతి సీజన్‌తో ఇప్పటివరకు, దేశంలో 836.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, సగటు వర్షపాతం (772.5 మిల్లీమీటర్లు)తో పోల్చితే 8శాతం ఎక్కువ వర్షం కురిసిందని ఐఎండీ వెల్లడించింది. దక్షిణ భారతంలో 25శాతం, మధ్య భారతంలో 19శాతం, వాయువ్య ప్రాంతంలో 4 శాతం సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కన్నా 16 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతు పవనాలు ఏటా కేరళలో జూన్ 1న తీరాన్ని తాకుతాయి. జూలై 8 కల్లా దేశమంతా విస్తరిస్తాయి. సాధారణంగా సెప్టెంబర్ 17తో మొదలయ్యే నైరుతి తిరోగమనం, అక్టోబర్ 15 నాటికి పూర్తవుతుంది.