నల్గొండ : కార్మిక దినోత్సోవం రోజున ఫార్మాల్యాబ్లో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ఫార్మా ల్యాబ్ (Pharma Lab) లోని బ్లాక్ 3లో రియాక్టర్ పేలింది ( Reactor Explodes ). బ్లాక్లో 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదే ఫార్మా కంపెనీలో ఏప్రిల్ 9న రెండో బ్లాక్లో రియాక్టర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నెలరోజులు కూడా గడవకుండానే రెండు ప్రమాదాలు జరిగాయని కార్మికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.