హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): ఇరాన్ కేంద్రంగా అవయవాల అక్రమ రవాణా జరుగుతున్నట్టు కేంద్ర దర్యా ప్తు సంస్థలు అనుమానిమానిస్తున్నాయి. మన దేశంలో కూడా అక్రమ రవాణా జరుగుతున్నట్టు గుర్తించాయి. బాధితుల్లో హైదరాబాద్, బెంగళూరుకు చెందినవాళ్లు ఉన్నట్టు అనుమానిస్తున్నాయి. కిడ్నీ, కాలేయం వంటి అవయవాలకు అంతర్జాతీయంగా ఎక్కువగా డిమాం డ్ ఉండటంతో ముఠాలు వీటిపైనే కన్నేశాయి.
లైవ్ ట్రాన్స్‌ప్లాంట్ పద్ధతిలో అవయవాల రవాణాకు ఎక్కువ అవకాశాలున్నాయి. కొన్ని ముఠాలు అమాయకులకు డబ్బు ఆశ చూపిం చి, అవయవాలను సేకరించి రవాణాకు పా ల్పడుతున్నాయి. మన దేశం నుంచే అవయవాల రవాణా జరుగుతున్నట్టు అనుమానిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు దీనికి అడ్డుకట్ట వేసేదిశగా చర్యలు చేపడుతున్నాయి.