Traffic Alert | హైదరాబాద్‌లో సాయంత్రం 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు..
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో (LB Stadium) మధ్యాహ్నం 1.04 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది.
హైదరాబాద్: తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో (LB Stadium) మధ్యాహ్నం 1.04 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తిచేసింది. ఈనేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆ సమయంలో పలు రోడ్లను మూసివేయడంతోపాటు పలు రూట్లలో వాహనాలను దారిమళ్లించనున్నారు.
ఇందులో భాగంగా పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ఎస్బీఐ గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి వైపు, ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ఈనేపథ్యంలో రవీంద్ర భారతి, పోలీసు కంట్రోల్ కాంప్లెక్స్, బషీర్‌బాగ్, ఎస్బీఐ గన్‌ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్, లిబర్టీ సర్కిల్, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్ జంక్షన్ల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నగరవాసులు, వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇబ్బందులుంటే 9102033626 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

