హైదరాబాద్: మృగశిర కార్తె (Mrigasira Karthi) సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. శనివారం అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. దీంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్, పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం డండటంతో ట్రాఫిక్ రద్దీని బట్టి, ట్రాఫిక్ మళ్లింపు, నిలిపివేతలు చేపడుతామని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.