హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారుల్లో రాతియుగపు ఆనవాళ్లు కనిపించాయి. గుట్టల్లో మధ్య యుగానికి చెందిన చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఓఆర్ఆర్ దగ్గర ఉన్న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పారు వెనుక గుట్టల్లో ఉన్న ఈ చిత్రాలను ట్రెక్కర్లు మీర్ ఒమర్ అలీ ఖాన్, రిషబ్ గుర్తించగా, వారి సమాచారం మేరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, చరిత్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంఏ శ్రీనివాసన్‌తో సహా మరో ఆరుగురు విద్యార్థుల బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించింది.
ఈ గుట్టపై ఒక పెద్ద రాయిపై మధ్య రాతి యుగానికి చెందిన మూడు తాబేళ్ల చిత్రాలు, ఒక చేప బొమ్మ, ఒక రేఖా చిత్రం ఎరుపు రంగులో గీసి కనిపించాయని బుధవారం శ్రీనివాసన్ పేర్కొన్నారు. పాము పడగ లాగ ఉన్న ఈ పెద్ద బండ రాయి మధ్య రాతి యుగపు మానవుల నివాసానికి అనువైన స్థలమని, అందుకే ఇకడ వాళ్లు గీసిన చిత్రాలు, నివసించిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు.