హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ర్యాగింగ్ చేసినంత పని చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన తనను కలవకపోవడంపై తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. ‘దగ్గరి బంధువులను కోల్పోయిన రేవంత్‌రెడ్డికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. మనం మరోసారి కలుద్దాం. ఆయనకు, ఆయన టీమ్‌కు శుభాకాంక్షలు’ అంటూ సెటైరికల్ ట్వీట్‌చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న శశిథరూర్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు.
కానీ.. రేవంత్ ఆయన్ను కలవలేదు. తన దగ్గరి వాళ్లు చనిపోయారంటూ సమాచారమిచ్చారు. కానీ, సోమవారం ఉదయం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న రేవంత్.. మధ్యాహ్నం గాంధీభవన్‌లో మీడియా సమావేశం కూడా నిర్వహించారు. థరూర్‌ను మాత్రం ఆయన కలవలేదు. రేవంత్ వ్యవహారంపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతున్నది. ఎవరికి వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. రేవంత్‌రెడ్డి గతంలో శశి థరూర్‌ను గాడిద అని దూషించిన విషయం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే థరూర్‌ను కలవడానికి రేవంత్‌కు మొఖం చెల్లకపోయిఉండవచ్చని పార్టీ నేతలు అంటున్నారు.
was raging by the party’s senior leader Shashi Tharoor.