న్యూఢిల్లీ, జూన్ 11 (నమస్తే తెలంగాణ): మీనాక్షీనటరాజన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరసరించడం వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. ‘ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకొని ఆమెకు నోటీసులు పంపడం వెనుక రాజకీయ శక్తుల హస్తం స్పష్టంగా కనిపిస్తున్నది. కేవలం కాంగ్రెస్ అభ్యర్థులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు’ అని మండిపడ్డారు. ఏఐసీసీ అత్యవసర సమావేశంలో పాల్గొనేందుకు గురువారం ఢిల్లీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల నిబంధనలను అధికారులు తమకు నచ్చినట్టు వాడుకొంటున్నారని మహేశ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నామినేషన్ తిరసరణకు చూపిన కారణంలో ఎలాంటి చట్టబద్ధత లేదని పేర్కొన్నారు. ఒక అభ్యర్థిపై కోర్టు నోటీసులు ఉంటే, ఆ వివరాలను ఖచ్చితంగా ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేరొనాలనే నిబంధన చట్టంలో ఎకడా లేదని చెప్పారు. క్రిమినల్ కేసుల వివరాలను మాత్రమే వెల్లడించాల్సి ఉంటుందని, నిబంధనల్లో లేని అంశాన్ని సాకుగా చూపి నామినేషన్‌ను తిరసరించడం ముమ్మాటికీ బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యేనని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తన పరిధికి మించి వ్యవహరించారని విమర్శించారు.