Congress Party | పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున కాంగ్రెస్ పార్టీ నుండి వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన ఒక సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేను, పార్టీని దుర్భాషలాడినందుకు పార్టీ అధిష్టానం సీరియస్గా పరిగణించింది.
గతేడాది నవంబర్ 21 నాటికి సమాధానం ఇవ్వాల్సిందిగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై 2024 నవంబర్ 20వ తేదీన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి సమాధానం ఇచ్చారు. సుభాష్ రెడ్డి సమాధానంపై సంతృప్తి చెందని పార్టీ అధినాయకత్వం, క్రమశిక్షణ సంఘం శుక్రవారం అతనిపై వేటువేసింది. తాము ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి బహిష్కరణ నిర్ణయం అమల్లోకి వస్తుందని చిన్నారెడ్డి స్పష్టం చేశారు.