హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) హాల్ టికెట్లు సోమవారం నుంచి www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితారామచంద్రన్ తెలిపారు. ఈ నెల 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 7న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది.