BTech | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): బీటెక్‌లో కోర్ ఇంజినీరింగ్ కోర్సులకు కష్టకాలం వచ్చింది. ఒకప్పుడు హవా సాగిన కోర్సులిప్పుడు మూసివేత దిశగా సాగుతున్నాయి. మొత్తం సీట్లల్లో ఇప్పుడు కోర్ కోర్సుల ది 28శాతమే. సీఎస్ఈ కోర్ కోర్సుల ను చంపేస్తున్నది. సీట్లను మింగేస్తున్నది. ఫలితంగా ఆరేండ్ల కాలంలో 18 వేల కోర్ ఇంజినీరింగ్ సీట్లు రద్దయ్యా యి. ఉన్న సీట్లు కూడా పూర్తిస్థాయిలో భర్తీకావడంలేదు. 2024లో మొత్తం 33 వేల సీట్లుంటే, కేవలం 22వేల సీట్లు మాత్రమే భర్తీఅయ్యాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులను కోర్ కోర్సులుగా పరిగణిస్తారు. దేశంలో మౌలిక వసతుల కల్పన జరగాలంటే ఈ మూడు రంగాలే కీలకం.
రాష్ట్రంలో మొత్తం సీట్లల్లో 72 శాతం సీట్లు సీఎస్ఈ బ్రాంచిలవే ఉన్నాయి. ఆరేండ్ల కాలంలో సీఎస్ఈ సీట్లు, కోర్ కోర్సు సీట్ల సంఖ్య తారుమారైంది. 2019లో సీఎస్ఈ సీట్ల సంఖ్య 22 వేలు ఉంటే, 2024లో కోర్ కోర్సుల్లోని సీట్లు 25వేలయ్యా యి. ఇదే ఆరేండ్లల్లో సీఎస్ఈ సీట్ల సంఖ్య ఏకంగా 22వేల నుంచి 61వేలకు పెరిగింది. 2019లో సీఎస్ఈ సీట్లు 34శాతముంటే 2024కు వచ్చేసరికి 72శాతానికి పెరిగాయి. పెరుగుతున్న సీట్లన్నీ కోర్ బ్రాంచీలవే. కాలేజీలు కోర్ బ్రాంచీల సీట్లను తగ్గించుకుని, ఆయా సీట్ల స్థానంలో కంప్యూటర్ సైన్స్ సీట్లను పెంచుకుంటున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సీట్ల పెంపుదల విషయంలో సీలింగ్‌ను ఎత్తివేసింది. ఇష్టారీతిన సీట్ల కన్వర్షన్‌కు అనుమతిస్తున్నది. గతంలో కోర్ బ్రాం చిల్లో 160-240 సీట్లున్న కాలేజీల్లో ఏఐసీటీఈ ఆదేశాలతో ఒక బ్రాంచిలో 30 సీట్లకే పరిమితమవుతున్నాయి.