CM KCR | రేపటి నుంచి రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. సోమవారం బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు.
ఈ నెల 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 28వ తేదీ వరకు 54 సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే తొలి విడుత ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే.