హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో జర్మనీ భాషా నైపుణ్యంలో శిక్షణ పొందుతున్న పలువురు నర్సింగ్ అభ్యర్థులతో మంగళవారం జర్మనీ దేశ రాయబారి హెచ్ఈ డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణార్థులతో జర్మన్లో సంభాషించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీ కుమిదిణి, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ విద్యావతి, న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైన 120 మంది అభ్యర్థులకు ఆ దేశ నిధులతో ఐదు బ్యాచ్‌లలో శిక్షణ ఇస్తున్నారు.