సంప్‌లో పడి చిన్నారి మృత్యువాత.. తట్టుకోలేక నానమ్మ కన్నుమూత
ఇంటి ముందు ఆడుకుంటూ నీటి సంప్‌లో పడి చిన్నారి విగతజీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేక ఏడుస్తూ నానమ్మ గుండెపోటుతో మృత్యువాత పడింది. ఈ ఘటన జనగామ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్నది.
- జనగామ జిల్లా కేంద్రంలో విషాదం
జనగామ, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఇంటి ముందు ఆడుకుంటూ నీటి సంప్‌లో పడి చిన్నారి విగతజీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేక ఏడుస్తూ నానమ్మ గుండెపోటుతో మృత్యువాత పడింది. ఈ ఘటన జనగామ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్నది. సంజయ్‌నగర్‌కు చెందిన సుద్దాపెల్లి రఘువంశీ-సరిత దంపతుల కుమార్తె ప్రియాన్షి (2) ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంప్‌లో పడి మృతి చెందింది.
ఆ సమయంలో తండ్రి ఇంట్లోనే నిద్రిస్తుండగా తల్లి పనిలో ఉండగా, ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంట్లో బిడ్డ కనిపించడంలేదని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెతికితే సంప్‌లో శవమై కనిపించింది. మనుమరాలు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేక నాయనమ్మ నాగమ్మ రోదిస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

