హైదరాబాద్ డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేడు (శనివారం) నిర్వహించతలపెట్టిన ఆటోబంద్ను విరమించుకున్నట్టు ఆటో యూనియన్ జేఏసీ నేతలు వెల్లడించారు. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమక్షంలో శుక్రవారం ప్రకటించారు. అంతకుముందు తమ డిమాండ్లను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించాలని కూనంనేని సాంబశివరావును జేఏసీ నేతలు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీలోపు ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ గౌడ్ హామీ ఇచ్చారని పే ర్కొన్నారు. చర్చల్లో తనతోపాటు ఎమ్మెల్సీ కోదండ రాం, ఆటో యూనియన్ జేఏసీ నేతలు పా ల్గొంటారని, దీంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారానికి సీఎం దగ్గరికైనా వెళ్తామని కూనంనేని తెలిపారు. ఆటో కార్మికులు మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకం కాదని, వా రికి ఏడాదికి రూ.15వేలు, 50ఏండ్లు నిండిన వారికి పింఛన్, సంక్షేమ బోర్డు తదితర హామీలను అమలు చేయాలని పేర్కొన్నా రు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని నాయకులు హెచ్చరించారు.