వనపర్తి, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకొంటారు. అక్కడే అగ్రికల్చర్ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. 15 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించుకొని రోడ్డుమార్గంలో వనపర్తిలోని జడ్పీ ఉన్నత (బాలుర) పాఠశాలకు చేరుకొంటారు. ‘మనఊరు – మనబడి, మనబస్తీ – మనబడి’ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం నాగవరంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత నాగవరం పరిధిలో వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2:15 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభించి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వైద్య కళాశాల ఆవరణలో నిర్వహించే భారీ బహిరంగసభలో ప్రజలు, పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.