హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : టీజీ ఎప్సెట్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. సోమ, మంగళవారాల్లో విద్యార్థులు ఇంటర్నల్ స్లైడింగ్ వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 19న వెబ్ ఆప్షన్లను ఫ్రీజ్ చేస్తారు. 22న సీట్లు కేటాయిస్తారు.
సీట్లు పొందిన వారు 22, 23న కాలేజీలో రిపోర్టుచేయాల్సి ఉంటు ంది. ఇంజినీరింగ్లో సీటు వచ్చిన విద్యార్థులు అదే కాలేజీలో మరో బ్రాంచీలో సీటు ఖాళీగా ఉంటే, ఆయా సీటు కావాలనుకుంటే ఈ ఇంటర్నల్ ైస్లెడింగ్లో పాల్గొనవచ్చు. ఇలా సీటు మార్చుకున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది.