
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): దక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ల సమావేశం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలోని తాజ్ హోటల్లో జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ తదితర రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్య అధికారులు పాల్గొంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తరపు ప్రతినిధులుగా హోంమంత్రి మహమూద్‌అలీ, సీఎస్ సోమేశ్‌కుమార్ హాజరుకానున్నారు. సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతలతోపాటు సంగంబండ రిజర్వాయర్‌పై ఏపీ, కర్ణాటక రాష్ర్టాలు లేవనెత్తిన అభ్యంతరాల అంశం చర్చకు రానున్నది.