హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): డీఎస్సీ ఆన్లైన్ మెటీరియల్, వీడియోలు, టెస్ట్, గ్రాండ్ టెస్టులు పొందే దరఖాస్తుల గడువు బుధవారం ముగియనున్నది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు tsbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని టీఎస్బీసీ ఎంప్లాయీబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సూచించింది. వివరాలకు 040-27077929, 7780359322 నంబర్లను సంప్రదించాలని కోరింది.