హైదరాబాద్, జూలై10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగునీటిరంగ పితామహుడు, ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా నేడు ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ ఇంజినీర్స్ డే నిర్వహించనున్నారు. నవాజ్ జంగ్ బహదూర్‌కు నివాళులర్పించి, ఆయన జీవితంపై సాగునీటిరంగ నిపుణుడు, విశ్రాంత ఇంజినీర్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.