హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వేళైంది. ఆదివారం వేకువజాము నుంచే ఉత్సవాలు ప్రారంభం కానుండగా, ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు చేసింది. ఆలయాన్ని సర్వాంగ సుం దరంగా ముస్తాబు చేసింది. ఆదివారం బోనాలు, సోమవారం రంగం నిర్వహిస్తారు. ఆదివారం వేకువజామున 3.30 గంటలకు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పట్టు వస్ర్తాలతో తొలి బోనం సమర్పిస్తారని ఆలయ ఈవో గుత్తా మనోహార్‌రెడ్డి వెల్లడించారు. 6 క్యూలైన్లు, 2 వేల మంది పోలీసులతో బందోబస్త్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆరు ఎల్ఈడీ స్క్రీన్లు, ఏడు సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేశారు.
హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత బోనాల జాతరకు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటలకు మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్యనగర్ కమాన్ వద్ద నిర్వహించే అమ్మవారి పూజల్లో పాల్గొంటారు.