హైదరాబాద్, అక్టోబర్4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కే శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన ఎన్నికల అధికారి శ్యామ్, ఉప ఎన్నికల అధికారి డాక్టర్ రామారావు నేతృత్వంలో మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు.
అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా కే శ్రీనివాసులు, అసోసియేట్ అధ్యక్షుడిగా రామాంజనేయులు, జనరల్ సెక్రటరీగా సునీల్‌రాజ్, కోశాధికారిగా నామాల శ్రీనివాస్‌తోపాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.