ఉద్యమంలో టీజేఎఫ్ పాత్ర చరిత్రాత్మకం
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీజేఎఫ్ రజతోత్సవాల పోస్టర్‌ను మీడియా అకాడమీ మాజీ చైర్మన్, ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ ఆవిష్కరించారు.
- మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ
ఖైరతాబాద్, మే 28: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీజేఎఫ్ రజతోత్సవాల పోస్టర్‌ను మీడియా అకాడమీ మాజీ చైర్మన్, ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ ఆవిష్కరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ మలి దశ ఉద్యమంలో మొదలైన టీజేఎఫ్ ప్రస్తానం.. ప్రత్యేక రాష్ర్టావిర్భావం తర్వాత కూడా టీయూడబ్ల్యూజేగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్నదని చెప్పారు.
ఉద్యమకాలంలో సాగరహారం మొదలు మిలియన్ మార్చ్ వరకు, ఆపై తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో టీజేఎఫ్ పోషించిన పాత్ర చరిత్రాత్మకమని తెలిపారు. ఈ నెల 31న జలవిహార్‌లో జరిగే రజతోత్సవ వేడుకల్లో నాడు టీజేఎఫ్తో కలిసి నడిచిన అన్ని పార్టీల నాయకులు, ఉద్యోగ, ప్రజా సంఘాలు, మేధావులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ వేడుకలు ఏడాదిపాటు కొనసాగుతాయని, 2026 మే 31న ముగింపు సందర్భంగా జర్నలిస్టులు, టీజేఎఫ్ ఉద్యమ ప్రస్తానంపై పుస్తకావిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఏ రమణకుమార్, ఐజేయూ నేత అవ్వారి భాస్కర్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర కోశాధికారి పీ యోగానంద్, సహాయ కార్యదర్శి యార నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

