హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని టీటీడీ శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సందర్భంగా వచ్చే భక్తుల కోసం 25 గ్రాముల చొప్పున ఉండే లక్ష లడ్డూలను పంపించనున్నది. ఇందుకోసం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో రెండు లడ్డూల చొప్పున ప్యాకింగ్ చేశారు. ఇలా మొత్తంగా 350 బాక్సులను సిద్ధం చేశారు.