హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి దంపతులు తిరుమల శ్రీవారికి ఆదివారం భూరి విరాళం సమర్పించారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు వారు ఈ సందర్భంగా బంగారు శంఖం సమర్పించారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకొన్న అనంతరం ఆలయ ఈవో ధర్మారెడ్డికి బంగారు శంఖాన్ని సుధా నారాయణమూర్తి దంపతులు అందజేశారు. దాదాపు రెండు కిలోల బంగారంతో తయారు చేయించిన ఈ శంఖం విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా వారిని అభినందించారు.