హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) నూతన పాలకవర్గాన్ని ఏపీ ప్రభుత్వం నియమించింది. మొత్తం 24 మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ఏర్పాటుచేసింది. మండలిలో ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందినవారు సభ్యులుగా నియామకం అయ్యారు. తెలంగాణ నుంచి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సతీమణి సీతారంజిత్రెడ్డికి అవకాశం కల్పించారు.
ఏపీ నుంచి పొన్నాడ వెంకట సతీశ్‌కుమార్ (ఎమ్మెల్యే), సామినేని ఉదయభాను (ఎమ్మెల్యే), ఎం తిప్పేస్వామి (ఎమ్మెల్యే), సిద్ధవటం యానాదయ్య, చండీ అశ్వర్థనాయక్, పినాక శరత్ చంద్రారెడ్డి, మేక శేషుబాబు, ఆర్ వెంకటసుబ్బారెడ్డి, ఎల్లారెడ్డిగారి సీతారామరెడ్డి, గడిరాజు వెంకట సుబ్బారాజు, రాంరెడ్డి సాముల, ఎస్ఆర్ విశ్వనాథ్‌రెడ్డి, సిద్ద వీర వెంకట సుధీర్‌కుమార్, సుదర్శన్ వేణు, నెరుసు నాగసత్యం నియామకం అయ్యారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి బాలసుబ్రమణియన్ పలనిసామి, డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి వైద్యనాథన్, ఆర్వీ దేశ్‌పాండే, అమోల్ కాలే, మిలింద్ కేశవ్ నర్వేకర్, డాక్టర్ కేతన్ దేశాయ్, బోరా సౌరభ్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.