హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఎరువుల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఎరువులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎరువుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
యూరియా తదితర ఎరువులను ముందుగానే ప్యాక్స్, ఏఆర్ఎస్కేలకు సరఫరా చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ.. అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌పై చైర్మన్ రాయల నాగేశ్వర్రావుతో కలిసి మంత్రి తుమ్మల సమీక్షించారు. అధునాతన టెక్నాలజీ వినియోగించి గోదాములను నిర్మించాలని ఆదేశించారు. స్థలం కొరతను దృష్టిలో ఉంచుకొని సైలోస్ విధానంలో గోదాముల నిర్మాణం చేపట్టాలని సూచించారు.