జోగులాంబ గద్వాల : విహారంలో విషాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సందర్శనకు వచ్చి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. ధరూర్ మండల జూరాల ప్రాజెక్టు రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గానికి చెందిన శివకుమార్(మల్లేపల్లి), గణేష్(పీర్లగుట్ట), శ్రీకాంత్ (పెద్దాయపల్లి) ముగ్గురు కలిసి బైక్ పై జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు.
బైక్ పై గద్వాల వైపు వెళ్తున క్రమంలో డ్యాం రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేక్ వద్ద బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ కు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు కిందపడ్డారు. గణేష్ , శివకుమార్ లకు తీవ్రగాయాలయ్యాయి.గాయపడిన వారిని గద్వాల జిల్లా దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మహబూబ్ నగర్ జిల్లా హాస్పిటల్కు తరలించారు.