ఖైరతాబాద్, జనవరి 17: ప్రజాభవన్ వద్ద జరిగిన కారు ఘటన కేసులో పోలీసులు బుధవారం ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. గత నెల 24న ప్రజాభవన్ వద్ద ఓ బారికేడ్‌ను కారు ఢీకొట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ అమీర్ ప్రధాన సూత్రధారిగా పంజాగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు.
రహీల్ దుబాయ్‌కి పారిపోయేందుకు పదిమంది సహకరించినట్టు దర్యాప్తులో తేలిందని చెప్తున్నారు. వారిలో రహీల్ ఇంట్లో పనిచేసే ఆసిఫ్, అర్బాజ్, సోహెల్‌ను రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో రహీల్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే షకీల్, అతని మామ జకారియా, బావమరిది షాహిద్పైనా కేసు నమోదు చేశారు. అస్లాం అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పంజాగుట్ట డీఐ క్రాంతికుమార్ తెలిపారు.