Gandipeta | గండిపేటలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం
రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipeta) మండలం ఖానాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం ఉదయం శంకర్పల్లి ప్రధాన రహదారిపై పోచమ్మ ఆలయం వద్ద ఆగిఉన్న లారీని వేగంగా దుసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipeta) మండలం ఖానాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం ఉదయం శంకర్పల్లి ప్రధాన రహదారిపై పోచమ్మ ఆలయం వద్ద ఆగిఉన్న లారీని వేగంగా దుసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అతికష్టంపై కారులోనుంచి తీసి దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితులంతా నిజాంపేటకు చెందినవారిగా గుర్తించారు.
నిజాంపేటకు చెందిన దివ్యకు వివాహం నిశ్చయం అయింది. దీంతో బ్యాచిలర్పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి టిఫిన్ చేయడానికి కారులో నార్సింగి సీబీఐటీ నుంచి ఖానాపూర్ వెళారు. తిరిగి వస్తుండగా అదుపుతప్పిన కారు.. పోచమ్మ దేవాలయం వద్ద నిలిచిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. కారులోని బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ ముందు సీట్లలో కూర్చున్నవారి ప్రాణాలను అవి కాపాడలేకపోయాయి. తీవ్రగాయాలపడంతో దివ్యతోపాటు మరో ఇద్దరు అక్కకడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.



Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

