హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): లా పీజీ కోర్సు అయిన ఎల్ఎల్ఎం కోర్సుల్లో ఈ ఏడాది 990 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆయా సీట్ల భర్తీ షెడ్యూల్లో అధికారులు స్వల్పమార్పులు చేశారు. ఎల్ఎల్బీ బ్యాక్‌ల్యాగ్ ఫలితాలు ఇటీవలే విడుదల కావడంతో అభ్యర్థుల కోరిక మేరకు షెడ్యూల్‌ను సవరించారు. 24 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశముండగా, ఇప్పటి వరకు 2వేల మంది చేసుకున్నారు. 25న అర్హుల జాబితాను ప్రదర్శిస్తారు. 26, 27న వెబ్ ఆప్షన్లు, 28న సవరణ, 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందినవారు అక్టోబర్ 1 నుంచి 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని, ఫీజు చెల్లించి రిపోర్ట్‌చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు తెలిపారు.
టాపర్ల చూపు.. బాంబే ఐఐటీ వైపు
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్‌లో సత్తాచాటిన టాపర్లు మొదటి జనరేషన్ ఐఐటీల్లోనే చేరుతున్నారు. ఐఐటీ బాంబేనే తమ మొదటి ఛాయిస్‌గా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీ, మద్రాస్‌ను ఎంచుకుంటున్నారు. సీట్లు రా ని వారు మాత్రమే రెండోతరం ఐఐటీల్లో చేరుతున్నారు. ఇదే విషయం జేఈఈ అడ్వాన్స్డ్-2024 జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఇటీవలే ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఐఐటీల్లో 17,695 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అత్యధికంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 1,915 మంది చేరగా, ఆ తర్వాత ఐఐటీ వారణాసిలో 1,572, ఐఐటీ బాంబేలో 1,371, ఐఐటీ రూర్కీలో 1,351 మంది చొప్పున ప్రవేశాలు పొందారు. ఐఐటీ హైదరాబాద్‌లో 595 సీట్లుండగా, 597 మంది చేరారు.